Telugu Gateway
Politics

పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలో జగన్ సర్కారుపై బిజెపి దూకుడు పెంచినట్లు కన్పిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ కంటే ఆ పార్టీనే వైసీపీని ఎక్కువ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా మతపరమైన అంశాలను ప్రస్తావించటం ద్వారా బిజెపి తన వ్యూహం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కన్పిస్తోంది. ఇలాంటి అంశాలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక వ్యక్తి ఉత్తరం రాసారని చర్చిలకు భద్రత ఇవ్వడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. చర్చిలకు భద్రతనివ్వడంతో పాటు పరిసర ప్రాంతాలలో ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఇంటరాగేట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నదీజలాలపై ఇద్దరు సీఎంలు కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే కుదరదని... రెండు రాష్ట్రాల ప్రజలు, రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని పురందేశ్వరి పేర్కొన్నారు. గోదావరి జలాల వినియోగంపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కెసీఆర్ లు ఈ అంశంపై భేటీ అవ్వటం ఆ తర్వాత ఉన్నతాధికారులు, ఇంజనీర్ల సమావేశాలు జరుగుతున్న తరుణంలో పురంధేశ్వరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎం జగన్ పదే పదే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించటం సరికాదన్నారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని తెలిపారు.

Next Story
Share it