Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీ సీట్ల పెంపులో కదలిక

అసెంబ్లీ సీట్ల పెంపులో కదలిక
X

ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు సంబంధించి సీట్ల పెంపులో కదలిక ఉందా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవలే ఎన్నికలు ముగిసినందున ఈ పెంపు ప్రభావం కోసం వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. పునర్విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 225కు, తెలంగాణలో ఉన్న 119 సీట్లు 153కు పెరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలకు చెందిన అప్పటి సీఎంలు చంద్రబాబు, కెసీఆర్ లు పదే పదే కేంద్రాన్ని సీట్ల పెంపుపై ఒత్తిడి చేశారు. గత ఎన్నికల్లో కెసీఆర్ తిరిగి అధికారం దక్కించుకోగా...చంద్రబాబు మాత్రం అధికారం కోల్పోవలసి వచ్చింది.

కానీ కేంద్రం మాత్రం ఈ అంశాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు తాజాగా తెరపైకి మళ్ళీ సీట్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాల్లో పునర్విభజనకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఢిల్లీ టాక్. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని చెప్పాలంటూ ఒక కేబినెట్ నోట్‌ను ఇప్పటికే ఈసీకి పంపినట్లు సమాచారం. జమ్మూకాశ్మీర్, సిక్కింతో పాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రంగం సిద్ధం అవుతోంది.

Next Story
Share it