Telugu Gateway
Telangana

మునిసిపోల్స్ లో తెలంగాణ బిజెపి సత్తా చాటుతుందా?!.

మునిసిపోల్స్ లో తెలంగాణ బిజెపి సత్తా చాటుతుందా?!.
X

తెలంగాణలో బిజెపి రోజురోజుకు దూకుడు పెంచుతోంది. ఎప్పుడైతే రాష్ట్రంలో నాలుగు లోక్ సభ సీట్లను దక్కించుకుందో అప్పటి నుంచే ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న తొలి ఐదేళ్ళు అవకాశం ఉన్నా కూడా ఆ పార్టీ తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే చెప్పాలి. అంతే కాదు పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించటం బిజెపికి రాజకీయంగా నష్టం చేసింది. అప్పట్లో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కెసీఆర్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రెండవ సారి ఎన్నికల తర్వాత అటు మోడీ వైఖరిలో..ఇటు కెసీఆర్ వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ఎన్నడూలేని రీతిలో సీఎం కెసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ లు బిజెపిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే...పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే బిజెపికి సహజంగా పట్టణ ప్రాంతాల్లో కాస్త బలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు సత్తా చాటుతుంది అన్నది భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. బిజెపి కనుక మునిసిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటగలిగితే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్ధిగా ఆ పార్టీనే నిలబడటం ఖాయం. బిజెపి కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు నడుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయో.

Next Story
Share it