ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషన్
BY Telugu Gateway16 July 2019 6:13 PM IST
X
Telugu Gateway16 July 2019 6:13 PM IST
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన బిశ్వభూషన్ హరిచందన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. హరిచందన్ ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో జన్మించారు. జనసంఘ్ కు చెందిన హరిచందన్ జనతా పార్టీ ఒడిశా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేశారు. భువనేశ్వర్ ఎమ్మెల్యేగా పని చేశారు.
దీంతో సుదీర్ఘ కాలంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగుతున్న నరసింహన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మాత్రమే కొనసాగుతారు. బిశ్వభూషన్ ఎప్పుడు అయితే బాధ్యతలు స్వీకరిస్తారో అప్పటి నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story