కెసీఆర్ పై దత్తాత్రేయ ఫైర్
BY Telugu Gateway21 July 2019 4:43 AM GMT

X
Telugu Gateway21 July 2019 4:43 AM GMT
తెలంగాణ సీఎం కెసీఆర్ పై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తీవ్ర విమర్శలు చేశారు. ఆగస్టు పదిహేను తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. మరి ఇంత కాలం చేసింది ఏంటి?. ఇది నకిలీ పాలనా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఐదేళ్ల క్రితం ముఖ్యమంత్రి అయ్యారని ఆ విషయం మరిచిపోయి ఇప్పుడే కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది చిత్రంగా ఉందని ఆయన అన్నారు. మున్సిపల్ చట్టం సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. మున్సిపల్ శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.
Next Story