Telugu Gateway
Cinema

టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ పై అమెరికాలో దాడి!

టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ పై అమెరికాలో దాడి!
X

ఆయ‌నో ప్ర‌ముఖ కమెడియ‌న్. తెలుగులో ఆయ‌న పేరు మీద ఎన్నో రికార్డులు. ఇటీవలే ఓ ప్రముఖ సంస్థ నిర్వ‌హించిన స‌మావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. అందులో పాల్గొన్నారు. అంతా సాఫీగానే సాగిపోయింది. ఆ త‌ర్వాత మ‌రో సంస్థ ముందుకొచ్చి స‌ద‌రు క‌మెడియ‌న్ ను స‌న్మానించేందుకు అని తీసుకెళ్లింది. అక్క‌డ కూడా స‌న్మాన కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముగిసింది. ఆ త‌ర్వాత పెద్ద పార్టీ న‌డిచింది. ఆ పార్టీ మ‌త్తులో స‌ద‌రు క‌మెడియ‌న్ ఆతిధ్యం ఇచ్చిన బ్యాచ్ కు చెందిన వారిలో ఒక మ‌హిళ‌తో అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఇది పెద్ద ర‌చ్చ‌కు దారి తీసింది. అంతే కాదు స‌ద‌రు క‌మెడియ‌న్ పై ఆ ఫ్యామిలీ స‌భ్యులు దాడి కూడా చేశారు. ఆ క‌మెడియ‌న్ మిస్ బిహేవియ‌ర్ కు సంబంధించి పోలీసు కేసు పెట్టేందుకు కూడా ఆ కుటుంబ స‌భ్యులు సిద్ద‌మ‌య్యారు. అమెరికాలో ఈ త‌ర‌హా కేసు అంటే బ‌య‌ట‌కు రావ‌టం క‌ష్ట‌మే. దీంతో నిర్వాహ‌కులు బాధిత కుటుంబానికి చెందిన వ్య‌క్తుల కాళ్లావేళ్లా ప‌డి కేసు పెట్ట‌కుండా ఆపే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో ఆ ఒక‌ప్ప‌టి టాప్ క‌మెడియ‌న్ బ‌తుకు జీవుడా అంటూ అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విష‌యం తాజాగానే ప‌రిశ్ర‌మ‌లో గుప్పుమంది. గ‌తంలో కూడా ఈ కమెడియ‌న్ ఓ హీరోయిన్ తో ఇలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడ‌టంతో ఓ ద‌ర్శ‌కుడు, ఆయ‌న సోద‌రుడు ఇంటికెళ్లి మ‌రీ చిత‌క‌బాదారు. గ‌త కొంత కాలంగా ఆ సంస్థ అమెరికాలో ఈ మ‌ధ్య ఏ కార్య‌క్ర‌మం నిర్వహించినా వివాద‌స్పదం అవుతోంది. అంతా సాఫీగా అయిపోయింద‌నుకున్న ద‌శ‌లో ఈ విష‌యం వెలుగులోకి వచ్చింది.

Next Story
Share it