Telugu Gateway
Andhra Pradesh

మోడీని కలవనున్న జగన్

మోడీని కలవనున్న జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. దీని కోసం ఆయన ఆగస్టు 6,7 తేదీల్లో ఢిల్లీ పర్యటన తలపెట్టారు. ఈ పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉందని..ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై క్లారిటీ కోసం ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీకి ఆర్ధిక సాయం విషయంలో కూడా ఒకింత ఉదారంగా ఉండాలని మోడీని కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధానితోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాలతో కూడా జగన్ భేటీ కానున్నారు. ఆగస్టు 1న జగన్ కుటుంబ సభ్యులతో కలసి వ్యక్తిగత పర్యటనగా జెరూసలెం వెళ్ళనున్నారు. అక్కడ నుంచి వచ్చాక ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. తర్వాత అమెరికా పర్యటనకు వెళతారు జగన్.

Next Story
Share it