Telugu Gateway
Andhra Pradesh

ఏపీ బడ్జెట్ 2.27 లక్షల కోట్లు

ఏపీ బడ్జెట్  2.27 లక్షల కోట్లు
X

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. నవరత్నాలే టార్గెట్ గా నూతన బడ్జెట్ కు రూపకల్పన చేశారు. ఈ బడ్జెట్ ఎక్కువగా సంక్షేమం ఫోకస్ గానే ముందుకు సాగినట్లు కన్పిస్తోంది. మొత్తం రూపాయలు 2 ల‌క్షల 27 వేల 974 కోట్లతో బ‌డ్జెట్‌ను సభకు సమర్పించారు. ఈ ఏడాదికిగాను ద్రవ్య లోటును రూ. 35వేల 260 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 1778 కోట్లుగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంచ‌నా వేశారు.

రాష్ట్ర జనాభాలో 60శాతంపైగా ఉన్న రైతులు, వ్యవసాయ సంబంధిత కుటుంబాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 ఏపీ మొత్తం బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ. 35,260 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 1,778గా పేర్కొన్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యుత్‌ రంగానికి రూ. 6861.03 కోట్లు

వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు

గృహ నిర్మాణానికి రూ. 3,617కోట్లు

రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు

ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు

ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ. 31,654.75 కోట్లు

కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ. 250 కోట్లు

ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు

రాజధానిలో మౌలిక సదుపాయాలకు రూ. 500 కోట్లు

ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ. 500 కోట్లు

ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్‌ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు

విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ. 200 కోట్లు

రాష్ట్రంలో కొత్త రైల్వే నిర్మాణాల్లో రాష్ట్ర వాటా రూ. 185 కోట్లు

అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ. 100 కోట్లు

మంగళగిరిని మోడల్‌ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు

కడప యాన్యూటీ ప్రాజెక్టులకు రూ. 120 కోట్లు

స్మార్ట్‌ సిటీస్‌ నిర్మాణం కోసం రూ. 150

అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూ. 446.77 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ. 4429.43 కోట్లు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధికి రూ. 6587 కోట్లు

ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్లు

రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు

ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు

రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు

గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు

సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు

వైఎస్సార్‌ రైతు బీమాకు రూ. 1163 కోట్లు

ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 475 కోట్లు

రైతుల ఉచిత బోర్లకు రూ. 200 కోట్లు

రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు రూ. 200 కోట్లు

Next Story
Share it