Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ హంగామా

అల్లు అర్జున్ హంగామా
X

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి అల్లు అర్జున్ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం కాకినాడ చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్ద హంగామా చేశారు. కాకినాడలో జరిగే షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పై పోరాట సన్నివేశాలతో పాటు, కొన్ని ముఖ్యమైన సీన్స్‌ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా పిలుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ‘నేను నాన్న’ అని వార్తలు వస్తున్నాయి.

మరోసారి ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, రావూ రమేష్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Next Story
Share it