Telugu Gateway
Cinema

నాగార్జునకు ‘బిగ్ బాస్ సెగ’

నాగార్జునకు ‘బిగ్ బాస్ సెగ’
X

తెలుగు బిగ్ బాస్ ను వివాదాలు వీడటం లేదు. ఈ షో వ్యాఖ్యాతగా వ్యవహరించున్న అక్కినేని నాగార్జునకు కూడా ప్రస్తుతం ‘బిగ్ బాస్’ సెగ తగులుతోంది. బిగ్ బాస్ లో ‘క్యాస్టింగ్ కౌచ్’ లేదని నాగార్జున ప్రకటించాలని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయన స్టూడియోల దగ్గర ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా విద్యార్దులు ఇప్పటికే నాగార్జునకు వ్యతిరేకంగా ధర్నాలకు పూనుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అసలు నాగార్జున ఈ షోలో పాల్గొనకూడదని వీరు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ తెలుగు బిగ్ బాస్ షోపై కేసులు నమోదు అవటం..వ్యవహారం ఏకంగా కోర్టు కూడా చేరిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే తమ బాస్ లను శాటిస్ ఫై చేయాలంటూ కొంత మంది ఫోన్లలో తమతో వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. మరి నాగార్జున విద్యార్ధుల డిమాండ్ మేరకు ఈ షో నుంచి వైదొలుగుతారా? అంటే అనుమానమే అని సమాధానం వస్తోంది.

Next Story
Share it