‘ఆమె’ ట్రైలర్ విడుదల

అమలాపాల్. ఈ మధ్య పెద్ద సంచలనంగా మారారు. ఆమె సినిమాలో ఆమె పూర్తి నగ్నంగా నటించి పెద్ద సంచలనం సృష్టించారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ పెద్ద సెన్సేషన్ గా మారింది. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆదివారం నాడు రిలీజ్ అయ్యింది.
టీజర్లో బోల్డ్ లుక్లో కనిపించిన అమలా పాల్, ట్రైలర్లో బోల్డ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.
https://www.youtube.com/watch?v=XLRsxeMv06A