Telugu Gateway
Andhra Pradesh

అమెరికాలో విశాఖ యువకుడు మృతి

అమెరికాలో విశాఖ యువకుడు మృతి
X

ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన ఆ యువకుడు మృత్యువాతకు గురయ్యాడు. ఊహించని ఈ ఘటనతో కుర్రాడి ఫ్యామిలీ షాక్ కు గురైంది. విశాఖ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని ఓ సరస్సులో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్‌ రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లాడు.

సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో ప్రమాదవశాత్తూ అవినాష్‌ గల్లంతయ్యాడని అతని స్నేహితులు వెల్లడించారు. అవినాష్‌ కుంటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. ఎంఎస్‌ పూర్తి చేసిన అతను ఇటీవలే ఉద్యోగంలో చేరినట్టు చెబుతున్నారు.

Next Story
Share it