Telugu Gateway
Andhra Pradesh

వివాదంలో విజయసాయిరెడ్డి జీవో!

వివాదంలో విజయసాయిరెడ్డి జీవో!
X

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. కేబినెట్ ర్యాంకుతో ఆయనకు ఈ పదవి అప్పగించారు. అయితే ఇఫ్పుడు రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డికి వేతనం అందుతుంది. ఇఫ్పుడు ఏపీ సర్కారు ఏకంగా కేబినెట్ ర్యాంకుతో మరో పదవి కట్టబెట్టడం వల్ల ఆఫీస్ ఆప్ ది ఫ్రాపిట్ కింద పదవికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు ఇస్తున్నామని చెప్పటంతోపాటు జీవో కాపీని డైరక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కు పంపిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.

నిజంగా ఎలాంటి వేతనంగా లేకుండా పనిచేసేట్లు అయితే కేబినెట్ ర్యాంక్ హోదా అన్నది ఇవ్వాల్సిన అవసంర ఉండదు. సర్కారు తీసుకున్న నిర్ణయం విజయసాయిరెడ్డికి చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవోలో మాత్రం ఎక్కడా వేతనం లేకుండా సేవలు అందిస్తారనే అంశం లేనందున..ఇది ఆఫీస్ ఆఫ్ ది ఫ్రాఫిట్ కిందకు వస్తుందని ఓ ఉన్నతాధికారి ధృవీకరించారు. మరి దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. గతంలో తెలంగాణలో కూడా కొంత మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇవ్వటం, దీనిపై కొంత మంది కోర్టును ఆశ్రయించటం తెలిసిందే.

Next Story
Share it