ప్రముఖ నటుడు కన్నుమూత
BY Telugu Gateway10 Jun 2019 12:52 PM IST

X
Telugu Gateway10 Jun 2019 12:52 PM IST
నటుడు..రచయిత..దర్శకుడిగా బహుముఖ ప్రజ్ణా పాటవాలు ఉన్న గిరీష్ కర్నాడ్. ఆయన సోమవారం నాడు బెంగుళూరులో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గిరీష్ కర్నాడ్ వయస్సు 81 సంవత్సరాలు. రంగస్థల నటుడిగా, రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.. శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, రక్షకుడు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాలో జన్మించిన కర్నాడ్ సినిమాల్లో నటిస్తూనే.. పలు రచనలు చేసి 1998లో జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. తుఝ, తలిదండ ఆయన కన్నడ ప్రముఖ రచనలు కాగా.. వంశవృక్ష అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.
Next Story



