Telugu Gateway
Cinema

‘చేతిలో గీతలా ఉండిపో’ అంటున్న రామ్

‘చేతిలో గీతలా ఉండిపో’ అంటున్న రామ్
X

హీరో రామ్ సందడి మొదలైంది. ఆయన నటించిన సినిమా ఇస్మార్ట్ శంకర్ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ‘ఉండిపో ఉండిపో చేతిలో గీతలా’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇ స్మార్ట్‌ శంకర్‌’.

డబుల్‌ దిమాక్‌ హైదరాబాద్‌ అన్నది క్యాప్షన్‌. నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లు. చార్మీ, పూరి జగన్నాథ్‌ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కంపోజ్‌ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ అనే మెలోడీ సాంగ్‌ను అనురాగ్‌ కులకర్ణి పాడగా, ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

https://www.youtube.com/watch?v=Iyr4qY-1v8Q

Next Story
Share it