మోడీ ఆ పని చేయాల్సిందే
BY Telugu Gateway16 Jun 2019 6:20 PM IST

X
Telugu Gateway16 Jun 2019 6:20 PM IST
ప్రధాని నరేంద్రమోడీకి ధైర్యం ఉంది. ఆర్డినెన్స్ తేవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి. దీనికి ఒక్క శివసేనే కాదు..దేశంలోని హిందువులు అందరూ మద్దతు ఇస్తారు. సంవత్సరాల తరబడి ఈ వివాదం సాగుతూనే ఉంది. ఆర్డినెన్స్ తో దీనికి పరిష్కారం చూపాలి అని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాడు తన కుమారుడు ఆదిత్యతోపాటు పార్టీకి చెందిన పద్దెనిమిది ఎంపీలతో కలసి అయోధ్యలోని రామ్ లల్లా మందిరాన్ని సందర్శించారు.
సాధ్యమైంత త్వరగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని థాకరే కోరారు. రామమందిరం నమ్మకానికి సంబంధించిన అంశం అని..ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. తామంతా రాముడి ఆశీర్వాదం తీసుకునేందుకే ఇక్కడికి వచ్చామన్నారు.త్వరలోనే మందిర నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story



