Telugu Gateway
Telangana

కేంద్ర హోం మంత్రికే బెదిరింపు కాల్స్

కేంద్ర హోం మంత్రికే బెదిరింపు కాల్స్
X

సాక్ష్యాత్తూ కేంద్ర హోం మంత్రికే ఇంటర్నెట్ ఫోన్ నుంచి బెదిరింపు కాల్స్. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఈ బెదిరింపు కాల్స్ అందాయి. ఆయన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 69734063 నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్స్ అందాయని కిషన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫోన్ చేసిన వ్యక్తులు ఏకంగా మంత్రిని చంపుతామని బెదిరించటం గమనార్హం. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఒకింత దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్ల వంటి ఘటనలు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చింది మాత్రం గత నెల 20న అని సమాచారం.

Next Story
Share it