బిజెపిలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి
BY Telugu Gateway26 Jun 2019 4:15 PM GMT

X
Telugu Gateway26 Jun 2019 4:15 PM GMT
తెలుగు దేశం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి షాకిచ్చి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా బిజెపిలో చేరారు. బుధవారం నాడు టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఢిల్లీలో బిజెపిలో చేరారు. బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జె పీ నడ్డా లంకా దినకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇంకా చాలా మంది టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి బిజెపిలోకి చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బిజెపిలో చేరటానికి ముందు లంకా దినకర్ టీడీపీకి రాజీనామా చేస్తూ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి పంపారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు కూడా బిజెపిలోకి క్యూకట్టనున్నారు .
Next Story