Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ఎమ్మెల్యేలు మాతోనూ టచ్ లో ఉన్నారు

టీడీపీ ఎమ్మెల్యేలు మాతోనూ టచ్ లో ఉన్నారు
X

ఎంతలో ఎంత మార్పు?. ఒకప్పుడు ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ఇఫ్పుడు ఉక్కబోతను ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని..అయితే తాము ఫిరాయింపులను ప్రోత్సహించబోమని కుండబద్దలు కొడుడూ ప్రకటించారు. ఒక వేళ ఎవరైనా వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పుడు బిజెపి వంతు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు తమతో కూడా టచ్ లో ఉన్నారని బిజెపి ప్రకటించింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో టీడీపీ భూస్థాపితం ఖాయం. ఎన్నికల్లో ఓటమితో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే కాలంలో ఊహించని విధంగా ఇంకా పెద్ద దెబ్బ టీడీపీకి తగులుతుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. చంద్రబాబునాయుడు, లోకేష్ అవినీతిపై వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి' అని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. నిజంగానే టీడీపీ ఎమ్మెల్యేలు..నేతలు పార్టీని వీడతారా? లేక చంద్రబాబును ఒత్తిడికి గురిచేసేందుకు ఆయా పార్టీలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయా?. కొద్ది రోజులు పోతే కానీ అసలు విషయం ఏమిటో తేలదు.

Next Story
Share it