Telugu Gateway
Cinema

పెళ్లికి రెడీ..షరతులు వర్తిస్తాయి

పెళ్లికి రెడీ..షరతులు వర్తిస్తాయి
X

తమన్నా. మిల్కీ బ్యూటీ. దశాబ్దానికిపైగా అటు టాలీవుడ్ తో పాటు తమిళం..ఇతర భాష్లల్లోనూ మెరుస్తున్న తార. ఆమె ఇఫ్పుడు పెళ్లి..రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పెళ్ళికి రెడీ అంటూ షరతులు వర్తిస్తాయి అనే కండిషన్ పెడుతున్నారు. ‘మంచి పెళ్లి కొడుకు దొరకాలి. దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పాను మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని. మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ.’ అంటూ ఝలక్ ఇఛ్చింది మీడియా ప్రతినిధులకు కూడా.

అదే సమయంలో రాజకీయాలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది తమన్నా. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన నాకు లేదు.నిజం చెప్పాలంటే నాకు రాజకీయాలు తెలియవు. ఏమో మరో ఐదేళ్లలో రాజకీయాల గురించి నేర్చుకుని, ఆ దిశగా పయనిస్తానేమో.’ అంటూ ఓ ఆప్షన్ అలా పెట్టేసుకుంది. తమన్నా నటించిన అభినేత్రి2 సిసిమా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథ చిత్రం సైరా నరసింహారెడ్డిలో చాలా ముఖ్యమైన పాత్రను షోషిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఐటెం సాంగ్స్ చేయటానికి సిద్ధమేనని..అయితే ముందు తనకు ఆ పాట నచ్చాలన్నారు.

Next Story
Share it