అల్లు అర్జున్..త్రివిక్రమ్ సినిమాలో సుశాంత్
![అల్లు అర్జున్..త్రివిక్రమ్ సినిమాలో సుశాంత్ అల్లు అర్జున్..త్రివిక్రమ్ సినిమాలో సుశాంత్](https://telugugateway.com/wp-content/uploads/2019/06/sushanth.jpg)
అల్లు అర్జున్ సినిమాలో మరో హీరో. ఇది ఆశ్చర్యకర పరిణామమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్ లో కొత్తగా జాయిన్ అయిన హీరో సుశాంత్. చాలా గ్యాప్ తర్వాత చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ హీరో. సుశాంత్ సోషల్ మీదియా వేదికగా తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ విషయాలను వెల్లడించారు. తన తరువాతి సినిమా అప్‌డేట్స్ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్‌డేట్స్ అనౌన్స్ చేస్తానని ప్రకటించాడు సుశాంత్.
అందులో భాగంగానే.. తాను అల్లు అర్జున్ -త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు హీరో సుశాంత్ ప్రకటించారు. ఈరోజే షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టానని.. తనకెంతో ఇష్టమైన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని.. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఇంతకంటే ఏం చెప్పలేనని అన్నారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.