హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీషన్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇఫ్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సచివాలయ భవనాలు కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గతంలో స్వయంగా ప్రభుత్వమే భవనాలు కూల్చటంలేదంటూ కోర్టుకు చెప్పిందని..ఇఫ్పుడు అందుకు భిన్నంగా సచివాలయ భవనాలు కూల్చేసి..కొత్తవి నిర్మిస్తున్నారని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది. ఓ వైపు జీవన్ రెడ్డి, మరో వైపు రేవంత్ రెడ్డి పిటీషన్ లపై విచారణ శుక్రవారం నాడే జరగననుంది.
సీఎం కెసీఆర్ గురువారం నాడే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సచివాలయం, వంద కోట్లతో అసెంబ్లీ నిర్మించాలని తలపెట్టారు. సచివాలయ భవనాల కూల్చివేత జూలైలో ప్రారంభం కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రివర్గ సబ్ కమిటీ నివేదిక రాగానే అధికారులు రంగంలోకి దిగనున్నారు.