Telugu Gateway
Telangana

రవిప్రకాష్ నుంచి కార్లు స్వాధీనం

రవిప్రకాష్ నుంచి కార్లు స్వాధీనం
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు ఆ సంస్థ నుంచి మరో షాక్. కంపెనీ ఇచ్చిన కార్లను శుక్రవారం నాడు తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆయన్ను టీవీ9 సీఈవో నుంచి తప్పించిన తర్వాత కూడా ఆయన వాటిని స్వాధీనం చేయలేదని..అందుకే పోలీసుల సాయంతో వీటిని తీసుకెళ్ళారు. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు.

రవిప్రకాశ్‌ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్‌ చేశారు. ఆయన డ్రైవర్స్‌ ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్‌ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

Next Story
Share it