‘రాక్షసుడు’ టీజర్ విడుదల
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమానే ‘రాక్షసుడు’. తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ‘సీత’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా బెల్లంకొండ మాత్రం తన దూకుడు ఏ మాత్రం తగ్గించటంలేదు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీని తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ లో విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
చిత్రీకరణ తుది దశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రీయూనిట్. జూలై 18న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు.
https://www.youtube.com/watch?time_continue=1&v=DDdHIQgxkgM