Telugu Gateway
Andhra Pradesh

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో

‘ప్రజావేదిక’ కూల్చివేతపై స్టేకు నో
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులను ‘ప్రజావేదిక’ కూల్చివేశారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే మంగళవారం రాత్రి నుంచే ఈ కూల్చివేత ప్రారంభం అయింది. బుదవారానికి కూల్చివేత పూర్తయింది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఓ అక్రమ నివాసం పక్కనే కోట్లాది రూపాయల ప్రజాధనం నిర్వహించిన ప్రజావేదిక నేలమట్టం అయింది. అయితే అర్థరాత్రి ఈ కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనంటూ పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పలుమార్లు పేర్కొన్న సంగతిని హైకోర్టు ప్రస్తావించింది. ప్రజావేదిక భవనం అక్రమమా? కాదా? అని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.

అలాంటప్పుడు ఇందులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఏముందని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సమర్థించింది. ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. ప్రజా వేదికను కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన పోలూరి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో ఆయన అత్యవసరంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అత్యవసరంగా విచారణ జరిపింది.

Next Story
Share it