పయ్యావుల కేశవ్ రాజీనామా
BY Telugu Gateway4 Jun 2019 6:44 PM IST
X
Telugu Gateway4 Jun 2019 6:44 PM IST
తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ తన ఎమ్మెల్సీ పదవికి మంగళవారం నాడు రాజీనామా చేశారు. తాజాగా ఆయన ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటంతో ఆయన ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Next Story