Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు మరో షాక్!

కాంగ్రెస్ కు మరో షాక్!
X

తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కానుందా?. ఎమ్మెల్యేలు అందరూ ఎవరి బాట వారు చూసుకోనున్నారా?. అంటే ఔననే సంకేతాలు అందుతున్నాయి. ఇఫ్పటికే 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో కలసి పోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టడం కష్టం అని..బిజెపినే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యానించి కలకలం రేపారు.ఆయన బిజెపిలో చేరటానికి నిర్ణయించుకున్న తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా బిజెపిలోకి వెళతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆదివారం జగ్గారెడ్డికి రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర ఆరోపణనలు చేసిన మరుసటి రోజే జగ్గారెడ్డితో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనతోపాటు జగ్గారెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లడానికి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఇంకెంత మంది బీజేపీలోకి చేరుతారు? అసలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరు మిలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ ను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా నాయకత్వలేమే ఈ పరిస్థితికి కారణంగా బావిస్తున్నారు.

Next Story
Share it