Telugu Gateway
Cinema

ఎన్టీఆర్..జూనియర్ బర్త్ డే స్పెషల్

ఎన్టీఆర్..జూనియర్ బర్త్ డే స్పెషల్
X

ఒకప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ అనే వారన్న సంగతి తెలిసిందే. అది కాస్తా ఇప్పుడు మామూలుగా ఎన్టీఆర్ గా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు జూనియర్ ఏ మాత్రం కాదు. సరే ఆ సంగతి కాస్త పక్కన పెడితే ఇవాళ ఎన్టీఆర్ ‘జూనియర్’ ఫస్ట్ బర్త్ డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన చిన్న కొడుకు భార్గవ రామ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. శుక్రవారం నాడు భార్గవ రామ్ తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

భార్గవ్ రామ్ తో కలసి ఓ ఊయలలో కూర్చున్న ఫోటోతోపాటు..అభయ్ రామ్...భార్గవ రా మ్ లు ఇద్దరూ పక్కపక్కన కూర్చున్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలను ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. భార్గవ రామ్ ను ఎన్టీఆర్ అభిమానులు లిటిల్ టైగర్ అంటూ వ్యాఖ్యానిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మరో హీరో రామ్ చరణ్ తో కలసి నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it