జగన్ కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు
BY Telugu Gateway17 Jun 2019 4:36 AM GMT

X
Telugu Gateway17 Jun 2019 4:36 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం కొత్త కాన్వాయ్ రెడీ అయింది. ప్రస్తుతం వాడుతున్న కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త ఫార్చూనర్ వాహనాలు కాన్వాయ్ లో చేరాయి. జగన్ కాన్వాయ్ కు ఏపీ 39 2345 నెంబర్లను కేటాయించారు. పాత కాన్వాయ్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు.
ముఖ్యమంత్రి మారిన ప్రతిసారి వాహనాలను మార్చటం పరిపాటే. సీఎం బాధ్యతలు చేపట్టిన వ్యక్తలు వారి వారి సౌకర్యాలను బట్టి తమకు అనుకూలంగా ఉండే వాహనాలను సమకూర్చుకుంటారు. ఇప్పుడు జగన్ కూడా అదే పనిచేశారు.
Next Story