విజయసాయిరెడ్డికి కీలక పదవి
BY Telugu Gateway5 Jun 2019 7:01 AM GMT

X
Telugu Gateway5 Jun 2019 7:01 AM GMT
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రకటించారు. అదే సమయంలో లోక్‌సభలో వైసీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్ విప్‌గా మార్గాని భరత్‌రామ్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు.
వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
Next Story