ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ
BY Telugu Gateway17 Jun 2019 5:53 AM GMT

X
Telugu Gateway17 Jun 2019 5:53 AM GMT
లోక్ సభ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ తొలుత ప్రధాని నరేంద్రమోడీతో లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు...అనంతరం రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమమే రెండు రోజుల పాటు సాగనుంది. ఈ సమావేశాల్లో బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడుతూ 17వ లోక్ సభలో ప్రజలకు చెందిన అనేక అంశాలపై చర్చలు జరిగి..పరిష్కారాలు కనుక్కోవాల్సి ఉందని అన్నారు. ప్రజల కోసం అందరూ తమకు సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలను తాము గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
Next Story