Telugu Gateway
Politics

టీడీపీ ఓటమికి ‘ఆ మూడే’ కారణమా?

టీడీపీ ఓటమికి ‘ఆ మూడే’ కారణమా?
X

‘టీడీపీ ఎట్లా ఓడిపోయిందో అర్థం కావటం లేదయ్యా?. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. అయినా సరే ఓడిపోవటమా?. ఇదేమీ అర్థం కావటంలేదు. ’ ఇవీ టీడీపీ అధినేత చంద్రబాబుతో కుప్పం నేతలు చేసిన వ్యాఖ్యలు. ‘పబ్లిక్ లో ఏ 5గురిని కదిలించినా ముగ్గురు ఇదే మాట్లాడుతున్నారు. అంత కష్టపడే వ్యక్తిని వదులుకోవడం ఏమిటనే అందరూ అంటున్నారు. ఈ రోజు టిడిపి బతికి ఉందంటే కారణం మీరేనయ్యా..? అదంతా మీ కృషి, మీ కష్టమే కారణం అయ్యా..?మీమీద జనానికి ఉన్న నమ్మకం అది..మాకు మీరుంటే చాలు, ప్రాణాలకు తెగించి కష్టపడతాం. మళ్లీ పార్టీని నిలబెడతాం. మేమంతా మీ వెంటే ఉన్నాం..తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం..మీరుంటే మాకు కొండంత ధైర్యం..‘‘త్రిబుల్ ఎం’’ మిమ్మల్ని ఓడించదయ్యా..‘‘మోడి-మనీ-మిషన్’’ మిమ్మల్ని ఓడించిందయ్యా’ అని కుప్పం నేతలు తేల్చారట. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమికి ‘‘ఎం- క్యూబే’’ కారణం. ముగ్గురు నాయకులు(మోడి,జగన్,కెసిఆర్), మూడు పార్టీలతో పోరాడాం. అందరూ కుమ్మక్కై మనల్ని ఓడించారు. మెషీన్లలో తేడా ఉంది...ఈడిబిలో ఫస్ట్, వృద్ధిరేటులో ఫస్ట్, పెట్టుబడులు ఆకర్షణలో ఫస్ట్, నరేగాలో ముందంజ, సిమెంట్ రోడ్లు, పంటకుంటలు,ఎల్ ఈడి బల్బులు,అభివృద్ధి పనుల్లోనే కాదు, సంక్షేమంలోనూ ముందున్నాం. వేల కోట్ల ఆర్ధికలోటులో కూడా పేదల సంక్షేమం పెద్దఎత్తున చేశాం.

అయినా ఓడిపోవడం ఎలా జరిగిందో అంతుపట్టడం లేదయ్యా..? వాళ్లు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు. దాడులు చేసి మనల్నేమో పూర్తిగా కట్టడి చేశారు. మోడి కక్షకట్టి మనల్ని ఓడించారు అంటూ వాపోయారు. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వినియోగిస్తారు. కాబట్టి ఎవరి బలం ఎంతో అక్కడే తేలిపోతుంది. కర్ణాటకలో చూశాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్-జెడి(ఎస్) కూటమి గెలిచింది. ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం’’ అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ,‘‘ఇంత చేశాక కూడా ప్రజల్లో వ్యతిరేకత రావడానికి అవకాశం ఎక్కడ ఉంది..? ఎక్కడ మిస్ అయ్యాం..? ఏం మిస్ కొట్టాం..’’ అనేదానిపై అందరూ ఆలోచించాలి, ఎవరికివారు విశ్లేషించాలి. పోలవరం పడకేయిస్తే,అమరావతిని అటకెక్కిస్తే, రాష్ట్రం ఎలా పురోగమనిస్తుంది..? కుప్పానికి నీళ్లు ఎలా చేరతాయి..? రాయలసీమలో నీటి కొరత అధిగమించడం ఎలా..?వీటన్నింటిపై చర్చ జరగాలి’’ అని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. కుప్పంలో తన ఆధిక్యత తగ్గడానికి గల కారణాలను అన్వేషించాలని, ఈ ఫలితాలను నిశితంగా అధ్యయనం చేయాలని సూచించారు. గతంలో ఇదే నేతలు కుప్పంలో 70వేల ఆధిక్యత తెచ్చారు,ఇప్పుడు 30వేల ఆధిక్యత వచ్చింది. అందుకు కారణాలను సమగ్రంగా విశ్లేషించాల్సివుంది.

హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకు నీళ్లు తెచ్చాం. మరో 5ఏళ్లు ఉంటే సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించేవాళ్లం. తాను ఈ నెలాఖరుకు కుప్పంలో పర్యటించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం తన కుప్పం పర్యటన ఉంటుందన్నారు. కుప్పంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. నేనే వచ్చి కూర్చుంటాను, ఏం చేయాలో,ఎలా చేయాలో అన్నీ చేద్దాం. అధికారం ఉన్నప్పుడు అసూయ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంలో ఉండాలి. ఒకప్పుడు మొత్తం అంతా లోపాలమయం. టిడిపి పాలనలో ఒకటి రెండే లోపాలు. దానినే బూతద్దంలో చూపి వ్యతిరేకతగా చెబుతున్నారు. తప్పులు పట్టడం కాదు ఇప్పుడు మనం చేయాల్సింది.

Next Story
Share it