Telugu Gateway
Cinema

మ‌న్మథుడు హంగామా స్టార్ట్

మ‌న్మథుడు హంగామా స్టార్ట్
X

నాగార్జున అంటే మ‌న్మ‌థుడు. ఓ సారి మ‌న్మ‌థుడుగా అమ్మాయిల మ‌న‌సు దోచిన ఈ హీరో మ‌రోసారి మ‌న్మ‌థుడు2 పేరుతో వ‌స్తున్నాడు. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలువ‌డింది. అదేంటి అంటే జూన్ 13న సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లుచిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రు. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తయ్యింది. త్వర‌లోనే చివరి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు ర‌కుల్‌, కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇప్పుడు టీజ‌ర్ తో సంద‌డి చేయ‌టానికి రెడీ అయ్యారు.

Next Story
Share it