Telugu Gateway
Cinema

ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా?

ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా?
X

ఇదీ నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు2లో ఓ డైలాగ్. నీకు షట్టర్లు మూసేసి దుకాణం సర్దేసే వయస్సు వచ్చేసింది. ఈ వయస్సులో మీకు పెళ్ళేంటి సార్. ఇలా సాగాయి మన్మథుడు2 చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన టీజర్ లో డైలాగ్ లు. టీజర్ లో డైలాగ్ లు అన్నీ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాయి. నాగార్జున మాత్రం టీజర్ లో నవ యువకుడిలా కన్పించి తన ఇమేజ్ ను అలాగే కాపాడుకున్నాడని చెప్పొచ్చు.

కాకపోతే ద్వందార్ధాలతో కూడిన ఆ డైలాగ్ లు నాగార్జున ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయని చెప్పకతప్పదు. ఈ సినిమాను చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌లపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా..మరికొన్ని కీలక పాత్రల్లో సమంత, కీర్తి సురేష్‌లు నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=TLWmy4u_qYY

Next Story
Share it