ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘపతి
BY Telugu Gateway17 Jun 2019 2:22 PM GMT

X
Telugu Gateway17 Jun 2019 2:22 PM GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ సోమవారం నాడు ప్రారంభం అయింది. సోమవారం నాడే నామినేషన్లు స్వీకరించారు. ఈ ఫోస్టుకు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. మంగళవారం నాడు ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రకటించనున్నారు. కోన రఘుపతి నామినేషన్ బలపరుస్తూ పదిమంది పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
Next Story