నాకు పీసీసీ ఇచ్చి ఉంటేనా!
BY Telugu Gateway17 Jun 2019 8:41 PM IST

X
Telugu Gateway17 Jun 2019 8:41 PM IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటం చేసి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకు ఇచ్చినా కాంగ్రెస్కు ఇంత ఘోరమైన పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తాను బిజెపిలో చేరే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని..ఏదైనా ఉంటే కార్యకర్తలు..నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.
తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా ఊహగానమే అని వ్యాఖ్యానించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో తాను ఢిల్లీకి వచ్చానని, తన హస్తిన పర్యటనలో ప్రత్యేకత ఏమీ లేదని రాజగోపాల్రెడ్డి మీడియాతో తెలిపారు.
Next Story