కేశినేని నాని మరో ‘‘పంచ్’’
విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని అసలు టార్గెట్ ఏంటి?. ఎందుకు పదే పదే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి వివాదాలకు కారణం అవుతున్నారు. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. తాను మాత్రం పార్టీ మారను అని చెబుతూనే నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతూ టీడీపీలో కలకలం రేపుతున్నారు. తాజాగా అలాంటిదే మరో పని చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంత్రివర్గ ఏర్పాటులో కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి ఛాన్స్ దక్కింది.
దీనిపై స్పందించిన కేశినేని నాని ‘ కొడాలి నాని తనను మంత్రిని చేసిన దేవినేని ఉమాకు జీవితాంతం కృతజ్ణుడిగా ఉండాలి’ అని పోస్ట్ పెట్టారు. కొడాలి నానిని మంత్రిని చేసింది జగన్ అయితే ..దేవినేని ఉమా అంటారు ఏంటి అనే అనుమానం రావొచ్చు ఎవరికైనా? కానీ దేవినేని ఉమా వల్లే కొడాలి నాని పార్టీని వీడారని..అందుకే ఇప్పుడు మంత్రి అయ్యారనే అర్ధం వచ్చేలా కేశినేని నాని పోస్టు పెట్టడం టీడీపీలో చర్చనీయాంశం అయింది. దీంతో కేశినేని మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.