Telugu Gateway
Andhra Pradesh

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని

ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని నాని
X

హాట్ టాపిక్ గా మారిన ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. గత కొన్ని రోజులుగా ఫేస్ బుక్ లో ఫుల్ యాక్టివ్ గా మారిన నాని..ఈ అంశంపై తన అభిప్రాయాన్ని కూడా ఫేస్ బుక్ వేదికగానే పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యలు...‘ ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం.

ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలా నష్టం . 1) ప్రజావేదికను ప్రజాధనంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ సొమ్ము వృథా అవుతుంది. 2) మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it