Telugu Gateway
Cinema

కీర్తిసురేష్ షాకింగ్ ఫోటోలు!

కీర్తిసురేష్ షాకింగ్ ఫోటోలు!
X

కీర్తి సురేష్ అనగానే మనకి గుండ్రటి మొహం గుర్తొస్తుంది. తర్వాత మహానటి సినిమాలో ఆమె నటన గుర్తుంటుంది. అలాంటి కీర్తి సురేష్ ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఆమెను చూసిన అభిమానులు షాక్ కు గురవున్నారు. అంతలా మారిపోయింది మరి ఈ బొద్దుభామ. కొత్తగా చేస్తున్న సినిమా కోసం కీర్తి జిమ్ లో భారీ కసరత్తు లు చేసి ఇలా తయారయ్యారు. స్పెయిన్ లో ఆమె దిగిన ఫోటోలను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.ఈ ఫోటోలు చూసి కీర్తి సురేష్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కీర్తి పూర్తి స్లిమ్ గా మారటంతో ఆమె రూపురేఖలే మారిపోయాయి. దీంతో ఇక మాకు ఆ క్యూట్ బుగ్గలు కనపడవా అంటూ అభిమానులు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. గుర్తుపట్టలేనంత సన్నగా ఎందుకు మారిపోయారు అంటూ మరికొంత మంది ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మన్మథుడు 2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సఖి సినిమా షూటింగ్ కోసం కీర్తి స్పెయిల్ వెళ్లినట్లు సమాచారం. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story
Share it