Telugu Gateway
Politics

కెసీఆర్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కెసీఆర్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రా?లేక సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. విభజనవాది..సమైక్యవాదిల భేటీ ముచ్చటగా ఉందని కెసీఆర్, జగన్ ల భేటీపై ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో తాము రాయలసీమకు నీళ్లిస్తామంటే ఆంద్రోళ్లకు దోచి పెడతారా అని కెసీఆర్ విమర్శించారని, ఇప్పుడు ఆయన రెండు రాష్ట్రాలకు నీళ్లు ఇస్తామని అంటున్నారని జీవన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులు ఏమయ్యాయని కెసీఆర్ ను ప్రశ్నించారు.

మన నీళ్ళను ఆంధ్రాకు తరలిస్తామని ఎలా అంటారు?. ప్రాణహిత పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు నీ ప్లాన్ ఏది? అని ప్రశ్నించారు. సమైక్యవాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని జీవన్‌రెడ్డి విమర్శించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రెండు లిఫ్టుల భారం తగ్గేదని, ప్రస్తుత సచివాలయ భవనాలకు ఇంకా 50 ఏళ్ల ఆయుష్షు ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story
Share it