Telugu Gateway
Politics

జగన్ సంచలన నిర్ణయం...ఐదుగురు డిప్యూటీ సీఎంలు

జగన్ సంచలన నిర్ణయం...ఐదుగురు డిప్యూటీ సీఎంలు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం నాడు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు మరో సంచలన నిర్ణయం వెలువరించారు. తొలి రెండున్నర సంవత్సరాలు పాటు కొంత మంది మంత్రులుగా ఉంటారని..తర్వాత మరికొంత మందికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్షం లో ఈ విషయాలు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. అలాగే కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి. ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్థదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు.

Next Story
Share it