Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌ర నుంచి త‌న పాల‌న‌లో అవినీతి ఉండ‌ద‌ని..టెండ‌ర్ల ఖ‌రారు కు కూడా జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ప్రాజెక్టుల్లో అవినీతిని స‌హించేదిలేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. క‌ళ్లు మూసుకోవాల‌ని త‌న‌పై కూడా ఒత్తిడి చేశార‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయినా స‌రే తాను రాజీప‌డలేద‌న్నారు. చెడిపోయిన వ్యవస్థను బాగుచేసుకోవడానికి తపిస్తున్నా అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈరోజు ఇలాంటి స్కాంలను సమర్థింలేమ‌న్నారు.

పైస్థాయినుంచి కింది స్థాయి వరకూ ఒక మెసేజ్‌ పోవాల‌ని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదు. రూ.100ల పని రూ.80లకే పని జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దాం అని సూచించారు. అలాంటి అధికారులను సన్మానిస్తామ‌ని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ చేయగలమో గుర్తించండి అని సూచించారు. మన ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలల‌న్నారు. పోలవరంలో అనేక అవకతవకలను జ‌గ‌న్ ఈ సమావేశంలో ప్ర‌స్తావించారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని అన్నారు.పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని జ‌గ‌న్ ఆరోపించారు. స్పిల్‌వే పూర్తిచేయకుండా కాఫర్‌ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారన్నారు. పోలవరం త‌న‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టు అని స్ప‌ష్టం చేశారు.

Next Story
Share it