జగన్ కొత్త మంత్రివర్గం ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 25 మందితో శనివారం నాడు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 152 సీట్లతో అసాధారణ విజయాన్ని దక్కించుకన్న జగన్ గత నెల 30న తానొక్కడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రివర్గ జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఈ జాబితాను జగన్ శుకవారం సాయంత్రం విజయవాడలో గవర్నర్ నరసింహన్ చేతికి అందజేశారు. శనివారం ఉదయం 11.49 నిమిషాలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం కానుంది. జగన్ సచివాలయంలోకి కూడా తొలిసారిగా శనివారం నాడే అడుగుపెట్టనున్నారు.
ముందు ఆయన తన కార్యాలయంలోకి ప్రవేశించిన ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఒకేసారి పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం కూడా ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. అంతే కాదు..ఈ సారి జగన్ ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని ప్రకటించి సంచలన ప్రకటన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఈ సారి తన మంత్రివర్గంలో ఐదుగురి ఎస్సీలకు చోటు కల్పించారు. రెడ్లు నాలుగు, కాపులకు నాలుగు, వైశ్య, రాజులు, వెలమ, కమ్మ, మైనారిటీ వర్గాలకు ఒకో బెర్త్ కేటాయించారు. రికార్డు స్థాయిలో ఏడుగురు బీసీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు.
కొత్త మంత్రులు వీరే
1. దర్మాన కృష్ణదాస్
2. బొత్స సత్యనారాయణ
3. అవంతి శ్రీనివాస్
4. కురసాల కన్నబాబు,
5 పుష్పశ్రీవాణి.
6. బాలినేని శ్రీనివాసరెడ్డి
7. పిల్లి సుభాష్ చంద్రబోస్
8.,ఆళ్లనాని
9. పినిపే విశ్వరూప్
10.తానేటి వనిత,
11. మేకతోటి సుచరిత
12. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13.గౌతం రెడ్డి
14. కొలగట్ల వీరభద్రస్వామి
15. చెరుకువాడ శ్రీరంగరాజు
16. పేర్ని నాని
17.కొడాలి నాని
18. అంజాద్ బాషా
19. ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి
20. మోపిదేవి వెంకటరమణ
21. గుమ్మనూరు జయరాం
22. నారాయణస్వామి
23. శంకర్ నారాయణ
24. అనిల్ కుమార్ యాదవ్
25.వెల్లంపల్లి శ్రీనివాస్