ఇస్మార్ట్ శంకర్ విడుదల వాయిదా
BY Telugu Gateway22 Jun 2019 5:24 PM IST

X
Telugu Gateway22 Jun 2019 5:24 PM IST
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల వాయిదా పడింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 12న రావాల్సి ఉంది. కానీ క్రికెట్ ప్రపంచ కప్ కారణంగా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అంటే జూలై 18న విడుదల చేస్తామని కొత్త తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ సినిమాకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. తొలుత హీరోయిన్లలో ఒకరి పాస్ పోర్టు పోయి షూటింగ్ లో కూడా జాప్యం జరిగింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచ కప్ అడ్డొచ్చింది. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో సినిమాపై హైప్ పెరిగింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Next Story



