Telugu Gateway
Cinema

యూత్ ఫుల్ ‘హిప్పీ’ ట్రైలర్

యూత్ ఫుల్ ‘హిప్పీ’ ట్రైలర్
X

హీరో కార్తికేయ ‘యూత్’ టార్గెట్ సినిమాలే చేస్తున్నట్లు కన్పిస్తోంది. తొలి సినిమా ఆర్ ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవటంతో ఈ కుర్ర హీరో అదే లైన్ లో ముందుకెళుతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘హిప్పీ’ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం నాడు ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జె డీ చక్రవర్తి డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘ఓటుకు నోటు కావాలె..మంచి ప్రభుత్వం గావాలె అనుకోవటం ఎంత గలతో.మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలె..జిందగీ అంతా సుఖంగా ఉండాలె అనుకోవటం కూడా అంతే తప్పు ’ అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తుంది. కలైపులి ఎస్ థాను ఈ సినిమా నిర్మాతగా ఉన్నారు. హిప్పీ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాష్లలో విడుదల కానుంది. మరి కార్తికేయ రెండవ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా? లేదా తెలియాలంటే జూన్ 6 వరకూ ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?time_continue=5&v=2C6EZckBRX8

Next Story
Share it