శర్వానంద్ డిశ్చార్చ్
BY Telugu Gateway21 Jun 2019 9:11 PM IST

X
Telugu Gateway21 Jun 2019 9:11 PM IST
హీరో శర్వాంద్ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. థాయ్ లాండ్ లో షూటింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన భుజానికి తీవ్రమైన గాయాలు అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శర్వానంద్ కు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం శుక్రవారం నాడు ఆస్పత్రి నుంచి ఈ హీరోను డిశ్చార్చ్ చేశారు. ‘96’ సనిమా చిత్రీకరణలో భాగంగా థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్‌కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. గాయం పెద్దది కావడంతో అతనికి రెండు నెలల బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’ సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది.
Next Story