చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి
BY Telugu Gateway8 Jun 2019 12:03 PM IST
X
Telugu Gateway8 Jun 2019 12:03 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పదవుల భర్తీని చకచకా చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయిన రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కి చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో అయిదుగురు విప్‌లను నియమించారు.
విప్‌లుగా కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందని అందరూ ఆశించినా, సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైంది.
Next Story