ఏపీలోని ప్రభుత్వ సూళ్ళలోనూ ఇంగ్లీష్ మీడియం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకబోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 40 వేల పాఠశాల ఫోటోలు తీసి..రెండేళ్ళ తర్వాత పాత వాటిని..కొత్త వాటిని పోల్చిచూపిస్తూ అభివృద్ధి ఎలా చేశామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లీషు మీడియంను అందుబాటులోకి తెస్తామని..అదే సమయంలో తలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని నిరక్ష్యరాస్యత 26 శాతం ఉంటే..ఏపీలో మాత్రం అది 33 శాతంగా ఉందన్నారు. విద్యార్ధులకు సరైన వసతులు..సౌకర్యాలు కల్పించకపోవటమే దీనికి కారణం అని పేర్కొన్నారు.
ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే బడికి వెళ్ళే పిల్లలున్న వారికి ఏటా 15000 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇఛ్చినట్లు తెలిపారు. పాదయాత్రలో తాను ప్రజల కష్టాలు తెలుసుకున్నానని..అందుకే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి తల్లి తమ పిల్లలను బడికి పంపాలని..జనవరి26న రాష్ట్ర వ్యాప్తంగా పండగ దినం నిర్వహించి..ఆ రోజు ప్రతి తల్లి చేతిలో 15 వేల రూపాయలు పెడతామన్నారు. ఏపీలోని విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు తెస్తామని జగన్ ప్రకటించారు.