దొరసాని దూకుడు
BY Telugu Gateway11 Jun 2019 12:38 PM GMT

X
Telugu Gateway11 Jun 2019 12:38 PM GMT
హీరో రాజశేఖర్..జీవితల కుమార్తే శివాత్మిక. ప్రస్తుతం ఆమె దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అమాయకపు లుక్స్ లో ఆమె ఈ సినిమా లుక్స్ తో సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో దొరసాని సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దొరసాని సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలి సినిమా దొరసాని రిలీజ్ కాకుండానే శివాత్మిక మరో మూవీకి ఓకె చెప్పినట్లు సమాచారం. త్వరలో రాజ్‌దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీహరి తనయుడు మేఘాంశ్, రెండో సినిమాలో శివాత్మిక హీరోయిన్‌గా నటించనున్నారట. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాను మేఘాంశ్ తొలి చిత్ర నిర్మాత ఎమ్‌ఎల్‌వీ సత్యనారాయణ నిర్మించనున్నారు.
Next Story