దుమ్మురేపుతున్న ఇస్మార్ట్ శంకర్ సాంగ్
హీరో రామ్ తన హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్ లతో కలసి దుమ్మురేపారు. ఈ సినిమాకు సంబంధించిన పాటను చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ఈ ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో చిత్ర ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని ఓ మాస్ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దిమాక్ ఖరాబ్ అంటూ సాగే పాట మాస్ ను ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.
https://www.youtube.com/watch?time_continue=103&v=SkXux-bc5es